తుఫానులొస్తున్నా వర్షాభావమే!

27-11-2026 | 05:00am

సముద్రంలో వరుస తుఫానులు ఏర్పడుతున్నాయి. వాతావరణ శాఖ(Meteorological Department) హెచ్చరికలు జారీ చేస్తోంది. వర్షాలు కురుస్తాయని ప్రజలు, రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఆశలు నెరవేరడం లేదు. తుఫానుల ప్రభావం తెలంగాణపై ఏమాత్రం కనిపించడం లేదు. తుఫానులు సముద్రంలోనే బలపడుతున్నా, వాటి ప్రభావంతో ఏర్పడే మేఘాలు తెలంగాణ వైపు పయనించకపోవడం, అల్పపీడనాలు అనుకూల దిశలో కదలకపోవడం, వర్షాలు కురిసినా కొద్ది ప్రాంతాలకే పరిమితం కావడం వంటి పరిణామాలు కరువు తీవ్రతను పెంచుతున్నాయి.

వర్షపాతం నమోదులో రాష్ట్ర సగటు సాధారణ స్థాయికి చేరినట్లు కనిపించినా, క్షేత్రస్థాయిలో భిన్నంగా ఉంటోంది.ఒక జిల్లాలో భారీ వర్షం కురిస్తే, పక్క జిల్లాలో చినుకు కూడా పడకపోవడం.. ఒక ప్రాంతంలో వరదలొస్తే, మరో చోట పొలాలెండిపో వడం మారుతున్న వాతావరణ పరిస్థితులద్దం పడుతోంది. సాధారణంగా జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ వరకు విస్తరించే నైరుతి రుతుపవనాలు ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల కొన్ని దశల్లో చురుగ్గా, మరికొన్ని దశల్లో బలహీనంగా మారడం రైతులకు ఇబ్బందులు కలిగించింది. విత్తనాలు వేసిన తర్వాత వర్షాలు ఆగిపోవడం, పంట ఎదుగుదల దశలో తేమ అందకపోవడం.. ఇలా వ్యవసాయానికి కీలకమైన దశల్లో వర్షాభావం దెబ్బతీసింది. 

తెలంగాణలో ఈ ఏడాది నైరుతి సీజన్‌లో సాధారణంగా 740.6 మి. మీ. వర్షపాతం నమోదు కావాలి. కానీ, 615.5 మి.మీ.కే పరిమితమైంది. అంటే 17శాతంలోటు వర్షం కురిసింది. అయితే, సగటు వర్షపాతం సాధా రణంగా అనిపించినా, 33 జిల్లాల్లో 18 జిల్లాలు వర్షాభావాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్‌లోనూ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. రాష్ర్టంలోని 365 మండలాలను కరువు  ప్రాంతాలుగా ప్రకటించాల్సి రావడం వాతావరణ పరిస్థితుల తీవ్రతకు అద్దం పడు తోంది. ఈ సంఖ్యలు కేవలం ప్రభుత్వ నివేదికల్లోని గణాంకాలు కావు. లక్షలాది రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సంకేతాలు.

తుఫానుల గురించి ప్రజల్లో సహజంగా ఒక ఆశ ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భావి స్తారు. అయితే ప్రతి తుఫాను ఇక్కడ వర్షాలను అందించదు.  బంగాళాఖాతంలో ఏర్పడిన వ్యవస్థలు ఒడిశా, పశ్చిమబెంగాల్ లేదా ఉత్తర భారత దిశగా పయనిస్తే తెలంగాణకు పెద్దగా ప్రయో జనం ఉండదు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసినా అవి రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే వ్యవసాయ అవసరాలను తీర్చలేవు. అం దుకే తుఫానుల వర్షాలపై ఆశలు పెట్టుకోవడం కంటే వాటి మార్గం, ప్రభావ పరిధి, వర్షాల విస్తరణను అంచనా వేయడం ముఖ్యం. 

ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు వర్షాల కోసం ఎదురుచూసే విధానానికి పరిమితం కాకుండా కరువు నిర్వహణపై ముందస్తు కార్యాచరణ రూపొందించాలి. నీటి వనరుల వినియోగానికి ప్రాధాన్యత క్రమాన్ని నిర్ణయించాలి. తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సాగుబడికి ఉపయోగించేలా ప్రణాళిక చేయాలి. చెరువుల పూడికతీత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనుల విస్తరణ వంటి చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. పంట నష్టాలను అంచనా వేసి రైతులకు పరిహారం, బీమా ప్రయోజనాలు అందించాలి. తక్కువ నీటితో పండే పంటల సాగుపై అవగాహన కల్పించాలి. పశువులకు మేత, తాగునీటి కోసం ప్రత్యేక కార్యాచరణ అవసరం. ఎల్ నినో ప్రభావం ఎం తకాలం కొనసాగుతుందో  కచ్చితంగా చెప్పలేక కపోవచ్చు. కానీ దాని ప్రభావాలను ముందుగానే గుర్తించి సిద్ధ పడటం మాత్రం ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది.  

 వ్యాసకర్త : జర్నలిస్ట్, 

సెల్: 9963991120

బత్తుల సత్యనారాయణ

మరిన్ని వార్తలు