రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి అమూల్యం

27-11-2026 | 05:05am
  1. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం
  2. భారత రాజ్యాంగానికి 77 ఏళ్లు పూర్తి
  3. అంబేద్కర్‌కు ప్రధాని మోదీ నివాళులు

న్యూఢిల్లీ, నవంబర్ 26: నారీశక్తి వందన్ పేరుతో మహిళలకు రిజర్వేషన్లను కల్పించే బిల్లును దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి ఒక అమూల్యమైన వారసత్వంగా రాజ్యాంగం నిలుస్తుందని అభివర్ణించారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడి గురువారానికి 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ అంబేద్కర్ నివాళులర్పించారు.

2019న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం సందర్భంగా రాజ్యాంగ ప్రతికి నమస్కరిస్తున్న ఫోటోను ప్రధాని బ్లాగ్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన బ్లాగ్‌లో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. మహిళలంటే ఆ పార్టీకి గౌరవం లేదని అన్నారు. మహిళలకు రిజర్వేషన్లను కల్పించడాన్ని ఏ శక్తి అడ్డుకోలేదని తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్నారు. రాజ్యాంగ హామీలు, హక్కులను అత్యంత నిరుపేదలకు అందజేయడంలో, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని నక్సలిజం అడ్డుకుందన్నారు.

ప్రస్తుతం నక్సలిజం అంతం కావడం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. 1951లో 42వ రాజ్యాంగ సవరణ వల్ల పౌరుల ప్రాథమిక స్వేచ్ఛ ప్రభావితం అయిందన్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో తీసుకువచ్చిన ఈ సవరణ దేశ న్యాయ సమీక్ష అధికారాన్ని పరిమితం చేసిందని, దేశంలోని సంస్థల మధ్య అధికార సమతుల్యతను మార్చిందని ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజ్యాంగాన్ని 22 భాషల్లో విడుదల చేశామన్నారు. బ్రిటిష్ కాలం నాటి శిక్షాస్మృతిని తొలగించి భారత న్యాయ స్మృతిని తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈ చట్టం పౌర హక్కులు, న్యాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. డిసెంబర్ 15లోపు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించిన సన్నాహాలను పూర్తి చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంత్రులకు సూచించిన విషయం తెలిసిందే.


మరిన్ని వార్తలు