పొదుపు ద్వారానే ప్రగతి
ఇటలీకి చెందిన ప్రొఫెసర్ ఫిలిప్పో రవిజ్జా 1924లో మిలాన్ నగరంలో జరిగిన ‘మొదటి ఇంటర్నేషనల్ సేవింగ్స్ బ్యాంక్ కాంగ్రెస్ (వరల్డ్ సొసైటీ ఆఫ్ సేవింగ్స్ బ్యాంక్స్) సమావేశంలోని ఆఖరి రోజు అక్టోబర్ 31ని ప్రపంచ పొదుపు దినోత్సవం(World Savings Day)గా ప్రకటించి, విశ్వవ్యాప్తంగా ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. ఆ విధంగా ఆనాటి నుంచి ప్రజల్లో పొదుపును ప్రోత్సాహించే దిశగా బ్యాం కులు, వివిధ ఆర్థిక సంస్థలు పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి.
పాఠశాల స్థాయి నుంచే కిడ్డీ బ్యాంకు అకౌంట్ ప్రారంభించారు. దాదాపు ప్రతి ఇంట్లో ‘డిబ్బీ’ మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ చిన్నతనం నుంచి డబ్బులు దాచడం ఒక అలవాటుగా, సాంస్కృతిక వారసత్వంగా మన కుటుంబ వ్యవస్థలో నే టికీ కొనసాగుతున్నది. ఇలా కూడబెట్టిన ధనం కొన్ని విపత్కర పరిస్థి తుల్లో ఆసరాగా దోహదం చేస్తుంది. కొన్ని స్థిర, చర ఆస్తులు సంపాదించుకోవడానికి దోహదం చేస్తుంది.
ఇక 20వ శతాబ్దపు తొలి నాళ్లల్లో దాదాపు 29 దేశాలు మొదటి ప్రపం చ యుద్ధానంతరం కుటుంబ అవసరాలకు, ఆ మాటకు వస్తే, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి పొదుపు పాటించాలి అని పిలుపునిచ్చారు. బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేయండి అని ప్రోత్సాహించారు. సమా జంలో ‘మంచి జీవనం’ కోసం పొదుపు ద్వారానే సాధ్యం అని తెలిపారు. 1921లోనే స్పెయిన్, అమెరికా వంటి దేశాల్లో జాతీయ పొదుపు దినోత్సవాలు జరపడం ప్రారంభించారు.
1923 తరువాత జర్మనీ కూడా పొదు పుపై ప్రత్యేక శ్రద్ధ చూపింది. ఇక రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా పొదుపు ఆవశ్యకత అందరికీ అర్థమైంది. అప్పటికే విశ్వమం తా రెండు ప్రపంచ యుద్ధాల వల్ల కలిగిన నష్టాలు, పరిణామాలు, ము ఖ్యంగా ఆర్థిక మాంద్యం వంటి దుర్భర పరిస్థితుల్లో, ఆర్థికంగా దేశాలు, ప్రజలు జీవితాలు ఎంత చిద్రమయ్యాయో కళ్లారా చూశారు. ఆ అనుభవం తరువాత పొదుపు ఆవశ్యకత గుర్తించి, నిజ జీవితంలో పాటించడం ప్రారంభించారు. ఆస్ట్రీయా పొదుపు సూచికగా ఒక మస్కట్ ‘స్పేర్ ప్రో (హేపీ సేవర్) ‘సేవ్ హేపీలీ వంటి అంశాలు ప్రచారం చేశారు.
ఇక ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతు న్న దేశాల్లో పొదుపు ఒక మంత్రంలా ఆచరిస్తున్నారు. ముఖ్యంగా దాదాపు ప్రతి ఒక్కరికీ బ్యాంకు అకౌంట్ తప్పని సరిగా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో అనాదిగా పొదుపు మన జీవితంలో ఒక భాగంగా, అలవాటుగా ఉండటం గమనించదగిన లక్షణం. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో ఎంతో కొంత పొదుపు చేయడాన్ని మన తల్లితండ్రులు, కుటుంబ పెద్దలు అలవాటు చేశారు. బ్యాంకులు కూడా పొదుపు చేసిన సొమ్ముకు, వడ్డీ ఇస్తున్నాయి. దీంతో ప్రజలు పొదుపు పట్ల ఆసక్తి పెంచుకున్నారు. ప్రైవేటు బ్యాంకులు కూడా పొదుపును ప్రోత్సాహిస్తూ అధిక వడ్డీలు ఇస్తున్నాయి. మ్బుల్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కువగా డైరెక్ట్ బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ (డీబీటీ) అవుతున్నాయి. డబ్బు విలువ అనగా రూపాయి విలువ క్షీణిస్తున్నది. మన పూర్వీకులు అలవాటు చేసిన పొదుపు మంత్రం పాటించాలి. ఆర్థిక పరంగా ఎంతటి ఒడిదుడుకులు ఎదురైనా, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నాణ్యమైన, స్థిరమైన, ఆరోగ్యకరమైనజీవితాన్ని ఆస్వాదించగలం. పొదుపు ద్వారానే మనం, మనదేశం సుభిక్షంగా ఉంటుందని ఈ పొదుపు దినోత్సవం సందర్భంగా అవగాహ న చేసుకోవడం మంచిది. పొదుపే ప్రగతికి సోపానం అని మరువరాదు. ప్రస్తుత పరిస్థితుల్లో, పొదుపు చేయడం చాలా అవసరమనిగ్రహించాలి.
వ్యాసకర్త సెల్: 9390509791
ఐ ప్రసాదరావు