4 September, 2026 | 10:38 PM

Breaking News

మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •  

స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

28-08-2026 | 06:12pm

మెప్సన్, న్యూ విజన్ డయాగ్నస్టిక్ సెంటర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించిన కలెక్టర్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ నగరంలోని పలు స్కానింగ్ , డయాగ్నొస్టిక్ సెంటర్లను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాకాజీ కాలనీ లోని మెప్సన్   డయాగ్నస్టిక్ సెంటర్, న్యూ విజన్ దయాగ్నస్టిక్ సెంటర్ ను  కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మెప్సన్ డయాగ్నస్టిక్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ అందులోని అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ గదులను పరిశీలించారు. డయాగ్నస్టిక్ సెంటర్ లో స్కానింగ్ ల వివరాలను స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ స్కానింగ్ కేంద్రంలో వివిధ రకాల స్కానింగ్ పరీక్షలకు  సంబంధించిన ధరల వివరాలను తెలిపే పట్టిక కింద పెట్టి ఉండటంతో స్కానింగ్ కేంద్రం ప్రతినిధులను కలెక్టర్ ప్రశ్నించారు. స్కానింగ్ పరీక్షల ధరలు పట్టికను స్కానింగ్ కోసం వచ్చే ప్రజలకు స్పష్టంగా తెలిసేలా నిబంధనల మేరకు పెట్టించాలన్నారు. అదేవిధంగా న్యూ విజన్ డయాగ్నస్టిక్స్ సెంటర్ ను తనిఖీ సందర్భంగా తాళం వేసి ఉండటంతో అక్కడి అండర్ గ్రౌండ్ (సెల్లార్ )ను పరిశీలించారు.

ఈ రెండు డయాగ్నస్టిక్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనల మేరకు బిల్డింగ్ ప్లాన్ ప్రకారం పార్కింగ్ కోసం కేటాయించిన స్థలాలను డయాగ్నస్టిక్ సెంటర్ కోసం ఉపయోగిస్తుండడంతో నోటీసులు జారీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. అప్పయ్యను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పార్కింగ్ కోసం అనుమతించిన ప్రదేశాలను ఎవరు కూడా ఇతర అవసరాలకు వినియోగించకూడదన్నారు. ధరల పట్టిక, సేవలందిస్తున్న డాక్టర్ ల వివరాలను ప్రజలకు కనిపించే విధంగా ప్రదర్శించాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రతి క్లినిక్ ,ఆసుపత్రి డయాగ్నొస్టిక్ సెంటర్లు,  క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం, పిసిపిఎన్డిటి చట్టం నియమాలను పాటించడంతో పాటుగా బయోమెడికల్ , మరియు కాలుష్య నియంత్రణ మండలి నియమాలను అనుసరించాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య కాకతీయ కిడ్నీ సెంటర్, సిద్ధార్థ కార్డియాక్ సెంటర్,వినోద డెంటల్ , మల్లిక చిల్డ్రన్స్ హాస్పిటల్ లను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ప్రదేశాన్ని మెడికల్ షాప్,ఇతర అవసరాలకు వినియోగిస్తున్న ఆసుపత్రులకు నోటీసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలియజేశారు.