ఎన్ఐటిలో హిందీ పఖ్వాడా ప్రారంభం
16-09-2026 | 10:57pm
హనుమకొండ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): జాతీయ సాంకేతిక సంస్థ(National Institute of Technology) వరంగల్ రాజా భాష హిందీ వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో హిందీ పఖ్వాడా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హిందీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది దైనందిన, అధికారిక సమాచారంలో హిందీ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు.
కార్యక్రమానికి డీన్ (ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్) ప్రొఫెసర్ రాజేష్ కుమార్ గార్జే ముఖ్య అతిథిగా హాజరై అధికారిక నోటింగ్తో పాటు రోజువారీ సమాచారంలోనూ రాజ భాష హిందీ వినియోగ ప్రాధాన్యాన్ని వివరించారు. రిజిస్ట్రార్ సునీల్ కుమార్ మెహతా రాజ భాష హిందీ ప్రాధాన్యతను వివరించి సంస్థ పరిపాలనా, విద్యా కార్యకలాపాల్లో హిందీ వినియోగాన్ని పెంచాలని సూచించారు.