సమాచార హక్కు చట్టంపై అవగాహన ఉండాలి

27-09-2026 | 09:49pm

-ఆర్టిఐ కమిషనర్ పివి శ్రీనివాస రావు

హనుమకొండ, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం(Right to Information Act) అమలుతో పాలనలో పారదర్శకత, ఖర్చులో జవాబిదారి తనం అలవారుతాయని కమిషనర్ పివిశ్రీనివాస్ అన్నారు. ఆదివారం గ్రేటర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. స్పందన ఫౌండేషన్, అబ్దుల్ కలామ్ ఫౌండేషన్ ఆనంద్ లహరి సంస్థల సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ న్యాయవాది గుడిమళ్ల రవికుమార అధ్యక్షత వహించగా పివి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అని అన్నారు.

చట్టాన్ని సద్వినియోగం చెలుకోవాలె తప్ప దుర్వినియోగం చేసుకోకూడదు అని హితవు చెప్పారు. చట్టాన్ని పకడ్బందీగా అములు చేసేందుకు కమిషన్ కృషి చేస్తుంది అని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలలో తప్పని సరిగా సమాచార హక్కు చట్టంలోని 4(1) బి ప్రకారం సిటిజన్ చార్ట్ ఏర్పాటు చెయ్యాలని కానీ అది సక్రమంగా అమలు కావడం లేదు అని గుర్తు చేశారు తాను ఆకస్మిక తనిఖీలకు వెళ్ళినప్పుడు ఈ విషయం బయటపడింది అని చెప్పారు.

రాష్టంలో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు కమిషన్ త్వరితిగతిన హియరింగ్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇప్పటికే 26 జిల్లాలు పర్యటించి చట్టం పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం తో పాటు ఆ జిల్లా కేసులను అక్కడ కలెక్టర్ కార్యాలయం లోనే హియరింగ్ నిర్వహించి ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని తెలియజేసారు.సమాజం లో ఇప్పటికి చాల మంది ప్రజలకు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారని గుర్తు చేసారు. ఆలాంటి వారికి బుద్ధి జీవులు అండగా ఉండాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ డా. నేరెళ్ల వేణుమాధవ్ సతీమణి నేరెళ్ల శోభమ్మ, రిటైర్డ్ ప్రొఫెసర్ డా.జ్యోతిరాణి, వందే భారత్ దర్శకుడు మల్లం  రమేష్, హనుమకొండ జిల్లా టి జి ఓ అధ్యక్షుడు శ్రీనివాసకుమార్, గెజిటెడ్ హెచ్ ఎం సంఘం అధ్యక్షుడు కొల్లూరు వెంకన్న, స్పందన ఫౌండేషన్ ఆర్గనైజర్ మడూరి శ్రీనివాసరావు, ఎ పి జె అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆనంద్ దేవునూరి, ఉపాధ్యాయ కళాకారుడు అంజన్ కుమార్,స్థానిక ప్రముఖులు నిమ్మల శ్రీనివాస్, మండల పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు