నోటీసులు బేఖాతర్.. లైసెన్స్ రద్దయినా హోటల్ షురూ!
27-09-2026 | 05:11pm
TG SAFE అధికారులు నోటీసులు ఇచ్చినా.. కొన్ని హోటళ్ల(Some hotels) తీరు మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిన్న పలు హోటళ్లలో తనిఖీలు(Inspections at hotels) చేపట్టిన అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించిన వాటికి లైసెన్సులు రద్దు(Licenses cancelled) చేస్తూ నోటీసులు ఇచ్చారు. అయితే గచ్చిబౌలిలోని అంతెరా బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు చేసినప్పటికీ..
ఇవాళ మళ్లీ హోటల్ తెరిచినట్లు సమాచారం. అంతేకాదు, అక్కడ పురుగులు పట్టిన ఆహార పదార్థాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నప్పటికీ.. తినేందుకు జనం ఎగబడటం చర్చనీయాంశంగా మారింది.లైసెన్స్ రద్దయినా హోటల్ ఎలా తెరిచారు? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.