సిరిసిల్ల భూవ్యవహారంపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
27-09-2026 | 03:42pm
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(REVANTH REDDY)కి బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లలో 8వేల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారంటూ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ తన లేఖలో ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతే సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్లలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ఆరోపణలు నిజమైతే, ఆ వివరాలను RTI కింద ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరోపణలను రుజువు చేయలేకపోతే సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేఖలో పేర్కొన్నారు.