రిటైర్డ్ ఎంప్లాయిస్ చలో సెక్రటేరియట్
హనుమకొండ, అక్టోబర్ 11(విజయక్రాంతి): రిటైర్డ్ ఎంప్లాయిస్ కు(Retired Employees) రావాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, చలో సెక్రటేరియట్ పోస్టర్(Secretariat poster) ను శ్రీధర్ల ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. హనుమకొండ పిఆర్టియు(Hanumakonda PRTU) భవన్లో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్(Retired Employees Association) ఉపాధ్యక్షులు ఎండి గఫార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో,రాష్ట్ర అసోసియేట్ అద్యక్షులు శ్రీధర్ల ధర్మేంద్ర మాట్లాడుతూ
మార్చి 2024 తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన బకాయిలు చెల్లించాలని ఎన్నిసార్లు ధర్నాలు చేసిన, వినతి పత్రాలు సమర్పించిన స్పందించకపోవడం వల్ల దాదాపు 63 ఏళ్ల వయసులో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, దాచుకున్న డబ్బులు జిఐఎస్, జిపిఎఫ్, అలవెన్సెస్, ప్రభుత్వం ఇవ్వవలసిన గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ 13న చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం చలో సెక్రటేరియట్ సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో మేకిరి దామోదర్, పెద్ది ఆంజనేయులు సంజీవరెడ్డి,సారయ్య, గణపతి, సాంబా రెడ్డి ,పి.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.