అంజలి గార్డెన్స్‌లో ఘనంగా లడ్డూ వేలం
21-09-2026 | 09:45pm
మణికొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కేఎన్‌ఆర్ హిల్స్‌లోని(KNR Hills) అంజలి గార్డెన్స్‌లో వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ వేలంలో వి. హర్షిల్ నాయుడు రూ.1.05 లక్షలకు లడ్డూను దక్కించుకుని విజేతగా నిలిచారు. నార్సింగి మార్కెట్ డైరెక్టర్ లక్ష్మీశ్రీ దంపతుల కుమారుడైన హర్షిల్ నాయుడు వేలంలో ఉత్సాహంగా పాల్గొని అత్యధిక ధరకు లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో కార్యక్రమంలో ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
లడ్డూ వేలంలో పలువురు భక్తులు పాల్గొని పోటీపడటంతో అంజలి గార్డెన్స్‌లో సందడి నెలకొంది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ వేలం భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది. నిర్వాహకులు వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.