జూరాల గేట్లను ఎత్తాలి

22-09-2026 | 05:05am
  1. కర్ణాటకతో రేవంత్ ప్రభుత్వం మాట్లాడాలి
  2. నేడు జూరాల ప్రాజెక్టును సందర్శిస్తాం
  3. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు చేయండి
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): దిగువ ప్రాంతాల్లో పంటలను కాపాడేందుకు జూరాల ప్రాజెక్ట్(Jurala Project) నుం చి నీటిని విడుదల చేసే లా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు(N Ramchander Rao) డి మాండ్ చేశారు. స్థానిక నాయకుల మధ్య వివాదా లు, సరై న సమన్వయం లేకపోవడం వల్ల దిగువ ప్రాంత రైతులు(Farmers) నష్టపోతున్నారని ఆయన ఎత్తి చూపారు. కర్ణాటక(Karnataka)లోని కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఆలమట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం నిర్ధారించుకోవాలని కోరారు.

రైతు కష్టాల కు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమని విమర్శించారు. వరంగల్‌కు చెం దిన విశ్రాంత ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్‌స్థాయి అధికారితో పాటు పలువురు ప్రముఖ నేతలకు పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన అనంతరం, రా ష్ట్ర కార్యాలయంలో రాంచం దర్‌రావు మీడియాతో మాట్లాడారు.

జూరాల ప్రాజెక్టులోని నీటిమట్టాన్ని పరిశీలించి, రైతు ల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తన నేతృత్వంలోని బీజేపీ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మంగ ళవారం జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రజల అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరలేపా యని ఆరోపించారు. 

కేసులు ఎందుకు పెట్టడంలేదు?

ఫామ్‌హౌస్ వివాదాల్లో కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. వినాయక నిమజ్జన ఊరేగింపు ఏర్పాట్లకు పోలీసు బలగాలను ఉపయోగించకుండా, ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ చుట్టూ మోహరించి ప్ర భుత్వం పోలీస్ శాఖను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల అరెస్టు ను ఆయన తీవ్రంగా ఖండించారు. సంప్రదాయం ప్రకారం హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతితో పాటు అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాం డ్ చేశారు.  

ఫసల్ బీమా అమలేది

2019 నుంచి బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణలో పీఎం ఫసల్ బీమా యోజన అమలు కాకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ పంట బీమాను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశా రు. ఎల్ నినో పరిస్థితుల వల్ల పంట నష్టపోయిన రైతులకు సరైన సమయంలో బీమా అందక తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు