అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహానాయకుడు

01-11-2026 | 05:37pm

జగిత్యాల, నవంబర్ 01 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్, డిక్కీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతలో విద్యా చైతన్యం పెంపొందించడం, సమానత్వం–సామాజిక న్యాయం పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రతి ఆదివారం నిర్వహించే అంబేద్కర్ స్మరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మునీరుద్దీన్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మునీరుద్దీన్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని వక్రీకరించి మార్చాలని చూస్తున్న వారికి, అందరూ కలిసికట్టుగా తగిన సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహానాయకుడని కొనియాడారు. ఆయన నిర్దేశించిన రాజ్యాంగ విధానాన్ని అందరూ గౌరవిస్తూ, దానిని ఆచరిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటేందుకు ప్రతి ఆదివారం ఈ స్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ గురించి మరింతగా తెలుసుకోవడానికి ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిత్తరి ప్రభాకర్, అంబేద్కర్ యువజన సంఘం కార్యదర్శి నక్కమల లక్ష్మీనారాయణ, జగిత్యాల పట్టణం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి కంటి అంజయ్య, సుంకరపల్లి అశోక్ తదితరులు అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు