ఘనంగా మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు

13-10-2026 | 05:03pm

కోటిలింగాలలో ఆయురారోగ్యాల కోసం ప్రత్యేక పూజలు

కేక్ కట్ చేసి అభిమానాన్ని చాటుకున్న నాయకులు, కార్యకర్తలు

ధర్మపురి (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాస్ రావు(former MPP Ponugoti Srinivas Rao) జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నక్క లక్ష్మణ్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో భారీ కేక్ కట్ చేసి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పొనుగోటి శ్రీనివాస్ రావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.పొనుగోటి శ్రీనివాస్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించి స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే  పొనుగోటి శ్రీనివాస్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పాశిగామ యువకుల ఆధ్వర్యంలో సోమవారం గమ్యం రెస్టారెంట్‌లో ముందస్తు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈకార్యక్రమాల్లో ఉప సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు గండ్ర ప్రతాప్ రావు, సర్పంచ్‌లు భూపెల్లి రాజయ్య, దొరిశెట్టి మల్లేశం, బొడ్డు రామస్వామి, బందెల ఉదయ్ గౌడ్, రాంధేని కోటయ్య, బోడకుంటి రమేష్ , దావుల లక్ష్మణ్,బండమీది గోపి, మెరుగు నరేష్, గాజుల రవి, యాగండ్ల గంగయ్య, రేగొండ శ్రీనివాస్, జక్కుల సత్యనారాయణ, జైశెట్టి రామ క్రిష్ణ, నక్క సురేష్,ముచ్చర్ల తిరుపతి, కాశం సంతోష్, గొపతి నరేష్, మల్లేష్‌తో పాటు పొనుగోటి అభిమానులు, అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు