మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల,(విజయ క్రాంతి): జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్(MLA Sanjay Kumar)ను తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్(Midday Meal Workers Union) జగిత్యాల జిల్లా సభ్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేయనున్న సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని, ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహార పథకాన్ని కూడా వంట కార్మికులతోనే నిర్వహించాలని వారు కోరారు.
అల్పాహార పథకానికి సంబంధించిన విధి విధానాలను వెంటనే ప్రకటించాలని, వంట కార్మికులకు అవసరమైన గ్యాస్‌తో పాటు వంట సరుకులను ప్రభుత్వం పూర్తిగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. వర్కర్స్ యూనియన్ సభ్యుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పందిస్తూ వారి సమస్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.