ఆలయ స్వాగత తోరణం నిర్మాణానికి శ్రీకారం

29-10-2026 | 10:28pm

ఎమ్మెల్యే రాందాస్ నాయక్ శంకుస్థాపన

కారేపల్లి,(విజయక్రాంతి): కారేపల్లి మండల పరిధిలో గురువారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలంలోని కొత్తూరు తండాలో గల సీతారామచంద్రస్వామి దేవాలయానికి సంబంధించిన స్వాగత తోరణం నిర్మాణ పనులకు ఆయన భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. తదుపరి మోట్లగూడెం గ్రామంలో మండలానికి చెందిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఆయా శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయ‌న పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు