మొగిలిపేట మత్స్య సహకార సంఘం అధ్యక్షుడిగా తొకల రాజు
మల్లాపూర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం(Fisheries Industrial Cooperative Society) అధ్యక్షుడిగా తొకల రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనూష ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. మత్స్యశాఖ పరిధిలోని మొగిలిపేట మత్స్య సహకార సంఘం పాలకవర్గ ఎన్నికలు బుధవారం మొగిలిపేటలో నిర్వహించారు.
సంఘ ఉపాధ్యక్షుడిగా గడ్డం పెద్ద శ్రీనివాస్, కార్యదర్శిగా బొల్లి నర్సయ్య ఎన్నికయ్యారు. పాలకవర్గ సభ్యులుగా గడ్డం రమేష్, దుబాక గణేష్, బొల్లి మాణిక్యం, బొల్లి చంద్రశేఖర్, తొకల శివయ్య, దుబాక రమేష్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని అధికారులు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.