చైనాలో క్రికెట్‌కు ICC బిగ్ ప్లాన్
ప్రపంచ క్రికెట్‌లో మరో భారీ మార్కెట్‌ను సొంతం చేసుకునే దిశగా International Cricket Council (ICC) అడుగులు వేస్తోంది. ఇప్పటికే క్రికెట్‌కు అంతగా గుర్తింపు లేని చైనాలో ఈ క్రీడను విస్తరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. క్రికెట్ ఒలింపిక్స్‌లోకి తిరిగి రావడం చైనాలో ఈ ఆటపై ఆసక్తిని పెంచడంతో.. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ICC భావిస్తోంది. చైనాలో క్రికెట్ అభివృద్ధికి అక్కడి జాతీయ సంఘం Chinese Cricket Association (CCA)కు పూర్తి సహకారం అందించేందుకు ICC సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా త్వరలో Tier 2 Cricket Event నిర్వహించేందుకు మద్దతు ఇవ్వనున్నట్లు ICC CEO సంజోగ్ గుప్తా తెలిపారు. తద్వారా చైనాలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ కార్యకలాపాలను మరింత పెంచే అవకాశం ఉంది. చైనాలో క్రికెట్‌కు బలమైన వ్యవస్థను నిర్మించేందుకు మరో కీలక అడుగు పడుతోంది. ICC Centre of Excellence ఏర్పాటు చేయడానికి ICC ఇప్పటికే Chinese Cricket Associationతో కలిసి పనిచేస్తోంది. దుబాయ్‌లో ఉన్న ICC Academy తరహాలో క్రికెటర్లకు శిక్షణ, అభివృద్ధి అవకాశాలు కల్పించేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు సంజోగ్ గుప్తా వెల్లడించారు.
మహిళల క్రికెట్‌కూ స్పెషల్ ఫోకస్
చైనాలో Women's Cricketను కూడా విస్తరించడమే ICC ప్రణాళికలో కీలక భాగంగా ఉంది. క్రికెట్‌ను మరింత మంది ప్రజలకు చేరువ చేయడంతో పాటు మహిళల ఆటకు అవకాశాలు పెంచాలని ప్రపంచ క్రికెట్ బాడీ భావిస్తోంది. గ్రాస్‌రూట్ స్థాయి నుంచి ఆటగాళ్లను తయారు చేయడం ద్వారా భవిష్యత్తులో చైనాలో బలమైన China Cricket Teamను నిర్మించే అవకాశాలపై దృష్టి సారిస్తోంది.
చైనాపై ఎందుకింత ఫోకస్?
భారీ జనాభా ఉన్న చైనాలో క్రికెట్‌కు బలమైన స్థానం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఆట విస్తరణకు కొత్త మార్కెట్ లభించినట్టే. ముఖ్యంగా Cricket in China, China Cricket Developmentకు ఊతమిచ్చేందుకు ఒలింపిక్స్‌లో క్రికెట్ చేరికను ICC ఒక కీలక అవకాశంగా చూస్తోంది. భారత్ వంటి క్రికెట్ దిగ్గజ దేశం తర్వాత అంత భారీ జనాభా ఉన్న చైనాలో ఈ ఆటకు పునాది బలపడితే.. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తులోనే పెద్ద మార్పులు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందుకే ICC China Cricket Strategy ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.