వివేకానంద డిగ్రీ కళాశాల ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు

08-10-2026 | 10:17pm

ముకరంపుర,(విజయక్రాంతి): గురువారం నగరంలోని ఒక ఫంక్షన్ హాల్‌ లో వివేకానంద విద్యాసంస్థల(Vivekananda Educational Institutions) ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్(Karimnagar Mayor Kolagani Srinivas) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలనం చేసి మేయర్ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. వివేకానంద డిగ్రీ కళాశాలలో చదువుకొని వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన పూర్వ విద్యార్థుల(Alumni)కు ఆయన చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.

అనంతరం కళాశాల యాజమాన్యం మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను శాలువాతో ఘనంగా సత్కరించింది. ఒకప్పటి ఇదే కళాశాల విద్యార్థి అయిన మేయర్, తన విద్యార్థి జీవితంలో తనకు జ్ఞానాన్ని అందించిన గురువులను శాలువాలు కప్పి ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ వివేకానంద డిగ్రీ కళాశాలలోనే విద్యనభ్యసించానని, జీవితం అంటే కష్ట సుఖాలతో కూడుకుందని కష్టపడిన వ్యక్తి ఫలితాన్ని అనుభవిస్తాడని విద్యార్థులకు సూచించారు.

స్వాతంత్ర సమరయోధులు మొదలుకొని శాస్త్రవేత్తలు, డాక్టర్లు, గొప్ప రాజకీయ నాయకుల లాంటి గొప్ప వ్యక్తుల జీవిత పుస్తకాలను అభ్యసించాలని సూచించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభను చూపి తల్లిదండ్రులతో పాటు గురువుల పేరు నిలబెట్టాలని తెలిపారు. నేను చదివి కళాశాలకు మేయర్ హోదాలో ముఖ్య అతిథిగా రావడం చాలా గర్వంగా ఉందని తెలిపారు.  మూడు సంవత్సరాల విద్యాభ్యాసం లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని... రక్తదాన శిబిరాల ద్వారా 690 మందికి రక్తదాన కార్యక్రమాలు చేశామని తెలిపారు.

కాశ్మీర్, కన్యాకుమారి లాంటి ప్రాంతాలతో పాటు దేశ వ్యాప్తంగా సమాజ సేవాలో జాతీయ సమైఖ్యత శిబిరాల్లో పాల్గొనడం, నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థికి, యువకుడికి లక్ష్య, సాధన, కృషి ఉండాలని అన్నారు. నేటి  యువత రేపటి దేశ సంపద, శక్తి అని వివేకానంద మాటలను గుర్తు చేశారు.  పట్టుదలతో లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ వి శ్రీరంగ ప్రసాద్ గారు, సెక్రటరీ, కరస్పాండెంట్ వి. ఆగం రావు గారు, త్రీ టౌన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ తిరుమల్ గౌడ్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు