యాదవ సంఘానికి నూతన ఉత్సాహం

08-10-2026 | 10:35pm

నూతన అధ్యక్షుడు చెల్కల జితేందర్ యాదవ్‌కు ఘన సన్మానం

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండల యాదవ సంఘం(Muttaram Mandal Yadava Association) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన చెల్కల జితేందర్ యాదవ్(Chelkala Jitender Yadav)కు జిల్లా యాదవ సంఘం నాయకులు రామగిరి మండల కేంద్రంలో తొట్ల తిరుపతి యాదవ్ నివాసంలో గురువారం ఘనంగా సన్మానం చేశారు. ఈ  కార్యక్రమంలో జితేందర్ యాదవ్ ను శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా(Peddapalli District) అధ్యక్షుడు మేకల మల్లేష్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంధవేణి రాజేందర్ యాదవ్ మాట్లాడుతూ యువ నాయకుడు చెల్కల జితేందర్ యాదవ్ నాయకత్వంలో ముత్తారం మండలంలో యాదవ సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. యాదవుల ఐక్యతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు.

నూతన అధ్యక్షుడు జితేందర్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన యాదవ సంఘం నాయకులు, సభ్యుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. మండలంలోని యాదవుల ఐక్యత, సంక్షేమం కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఉడుత పర్వతాలు యాదవ్, మంథని మండల అధ్యక్షుడు పర్ష మోహన్ శయాదవ్, గిరవేన రాములు యాదవ్, ఫకీరా యాదవ్, తిరుపతి యాదవ్, జాగిరి సదానందం యాదవ్, యుగేందర్ యాదవ్, కొడారి మల్లేష్ యాదవ్ తదితర యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జితేందర్ యాదవ్‌ను అభినందించారు.

మరిన్ని వార్తలు