ప్రతి డివిజన్ అభివృద్ధి పథంలోకి
చంద్రపురి కాలనీ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో ప్రతి డివిజన్ అభివృద్ధి పథంలోకి పయనిస్తుందని సకల జన హితం మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమని చంద్రపురి కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ చంద్రపురి కాలనీ డివిజన్లోని పాతబస్తీలో 130 మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ,సిసి రోడ్ల పనులను డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ప్రారంభించాడు.
అనంతరం స్థానిక ప్రజలు శాలువాతో సత్కరించి ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి సదానంద్, మాజీ కార్పొరేటర్ నవీన్ కుమార్, సతీష్ గౌడ్ ,ఎస్ సి సెల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు మాట్ల శ్రీనివాస్, నాయకులు రజిత గోపాల్, లత, సునీత, మేరీ, చిట్టిబాబు, నంగునూరు అశోక్ గుప్తా, సామాజిక సేవకులు బూడిద వెంకటేష్, సాయి కృష్ణ, రాహుల్, అజయ్ కుమార్, రమేష్ గౌడ్, సదానంద్ కురుమ, ఐలేను, కొమరయ్య, నాగరాజు, అనిల్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.