ఓటర్లకు బిగ్ షాక్
హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న Special Intensive Revision (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తయింది. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. దీంతో రాష్ట్రంలో తుది ఓటర్ల జాబితాలో సుమారు 2,43,23,059 మంది ఓటర్లు ఉండనున్నట్లు ఎన్నికల సంఘం అంచనా వేసింది. అయితే ఇదే సమయంలో ఏకంగా 73,39,235 ఓట్లు తొలగిపోయే అవకాశం ఉండటంతో SIR ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. SIRలో భాగంగా 1,71,99,536 మంది ఓటర్లు ఎలాంటి అదనపు ప్రక్రియ లేకుండానే తుది జాబితాలోకి చేరినట్లు సమాచారం. మరోవైపు సుమారు 93 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం(Telangana Election Commission
) నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో 71,23,526 మంది ఓటర్ల పత్రాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వీరిని కూడా తుది Telangana Voter Listలో కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
అయితే నోటీసులు అందుకున్న వారిలో ఇంకా 21,64,654 మంది ఓటర్ల దరఖాస్తులపై విచారణ కొనసాగుతోంది. వీరితో పాటు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 4.5 లక్షల మంది అప్లికేషన్లను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వెరిఫికేషన్ పూర్తయ్యాక తుది లెక్క మరింత స్పష్టంగా మారనుంది. ఇక Telangana SIR Final Voter Listపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. పెండింగ్‌లో ఉన్న విచారణలు, దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో అప్పటివరకు ఓటర్ల జాబితాలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా Telangana SIR Process ద్వారా 73,39,235 ఓట్లు తొలగిపోనున్నట్లు ప్రస్తుత లెక్కలు సూచిస్తున్నాయి. అయితే తుది జాబితా విడుదలకు ముందు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలన పూర్తికావాల్సి ఉంది. అందువల్ల ప్రస్తుతం ఉన్న సంఖ్యలను తుది గణాంకాలుగా కాకుండా ఎన్నికల సంఘం అంచనా లెక్కలుగా చూడాల్సి ఉంటుంది. నవంబర్ 9న విడుదలయ్యే Final Voter List Telanganaతో అసలు తుది లెక్కపై పూర్తి క్లారిటీ రానుంది.