గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
23-10-2026 | 07:05pm
9 లీటర్ల గుడుంబా స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
మల్లాపూర్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): మెట్పల్లి ఎక్సైజ్ కార్యాలయ(Metpally Excise Office) పరిధిలోని మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామంతో పాటు మెట్పల్లి మండలం వెలుల్ల గ్రామంలో శుక్రవారం తనిఖీలు చేపట్టి, అక్రమంగా నిల్వ ఉంచిన 9 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఎస్ఐ సింధు తెలిపారు. అక్రమంగా గుడుంబా తయారు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.