శేరిపల్లి పాఠశాలను సందర్శించిన సెక్టోరియల్ ఆఫీసర్

23-10-2026 | 08:10pm

శ్రీరంగాపురం, అక్టోబర్ 23: వనపర్తి జిల్లా(Wanaparthy District) శ్రీరంగాపూర్ మండలంలోని ఎంపీపీఎస్ శేరిపల్లి పాఠశాలను(MPPS Sheripalli School) సెక్టోరియల్ ఆఫీసర్, ఏఎంఓ కె. శేఖర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అదనపు తరగతి గదుల(Additional classrooms) అవసరాన్ని గుర్తించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించడంతో పాటు రెండో తరగతి విద్యార్థులకు స్పాట్ అసెస్‌మెంట్ నిర్వహించారు. వరండాలో రెండు తరగతులు నిర్వహించడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించారు.

గ్రామ ప్రజలు, ఉద్యోగుల విరాళాలతో నిర్మించిన తాత్కాలిక తరగతి గదులతో పాటు ప్రీ ప్రైమరీ విభాగం, బడితోట, పాఠశాల ఆవరణను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు అవసరమైన మౌలిక వసతుల ప్రాధాన్యతను ఈ సందర్శనలో గుర్తించారు.

మరిన్ని వార్తలు