భూ రీసర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ రవి
23-10-2026 | 07:59pm
హనుమకొండ, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే ప్రక్రియను జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి(Additional Collector Ravi ) శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు చేపట్టిన భూముల రీ సర్వే గురించిన వివరాలను సర్వేయర్, స్థానిక రైతులను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ భూ రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఐ రాజనర్సయ్య, ఇతర అధికారులతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.