జనగామలో పోటాపోటీ ర్యాలీలు
జనగామ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): జనగామ(Jangaon) జిల్లా కేంద్రంలో ఈరోజు రెండు పార్టీలు పోటాపోటీగా ర్యాలీ(Rally)లు తీశాయి. బీఆర్ఎస్ ర్యాలీ - రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేస్తామని చెప్పి 1000 రోజులైనా అమలు చేయలేదని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైల్వే స్టేషన్ నుండి ఆర్టీసీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ తీసి, అనంతరం చౌరస్తాలో సభ నిర్వహించారు.
కాంగ్రెస్ ర్యాలీ - ఆర్టీసీ చౌరస్తా నుండి నెహ్రూ పార్క్ వరకు,దీనికి పోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా ర్యాలీ తీసింది. ఆర్టీసీ చౌరస్తా నుండి నెహ్రూ పార్క్ వరకు కాంగ్రెస్ శ్రేణులు సంబరాల ర్యాలీ నిర్వహించారు. జిల్లా సాధనలో కాంగ్రెస్ పాత్రను చాటుతూ, కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒకే చౌరస్తా కేంద్రంగా రెండు ర్యాలీలు జరగడంతో జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.






