17 August, 2026 | 4:13 AM

Districts - Jangaon

article_74293515.webp
జనగామలో డాటా ఎంట్రీ పోస్టులకు పోటీ.. ఒక సీటుకు 76 మంది

జనగామ, ఆగస్టు 16 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆధ్వర్యంలో జనగామ కలెక్టరేట్ కార్యాలయంలో 5 డాటా ఎంట్రీ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించారు. ఈ 5 పోస్టులకు జిల్లా వ్యాప్తంగా 380 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఆదివారం పరీక్షకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కలెక్టరేట్ గేట్ వద్ద ఉదయం నుంచే అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు బారులు తీరారు. ఒక పోస్టుకు 76 మంది చొప్పున పోటీ ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంట్రాక్ట్ ఉద్యోగమైనా స్థిరమైన ఆదాయం కోసం యువత పెద్ద ఎత్తున తరలి రావడం గమనార్హం. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ జా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

16-08-2026

article_47084268.webp
విద్యా సేవలకు గుర్తింపు - లిల్లీ మేరీకి సత్కారం

జనగామ, (విజయక్రాంతి):జనగామ జిల్లా కేంద్రంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి అధికారులు ప్రశంస పత్రాలను అందజేశారు. జిల్లా విద్యా రంగంలో విశేష కృషి చేసిన తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన ఉత్తమ ఉపాధ్యాయురాలు లిల్లీ మేరీ కి ప్రశంస పత్రాన్ని అందజేశారు. జిల్లా స్థాయి అధికారుల చేతుల మీదుగా లిల్లీ మేరీ ఈ అవార్డును స్వీకరించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి సత్కరించడం ముదావహమని అధికారులు పేర్కొన్నారు.

15-08-2026

article_51452816.webp
ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జనగామ, (విజయక్రాంతి): 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జనగామలోని 13వ వార్డులో ఘనంగా జెండా వందన కార్యక్రమం జరిగింది. 13వ వార్డు కౌన్సిలర్ పానుగంటి సువార్త ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వార్డు పరిధిలోని మున్సిపల్, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్యుత్, నీటి సరఫరా తదితర ప్రభుత్వ శాఖల సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సువార్త మాట్లాడుతూ, "స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలి. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ శాంతి, సమైక్యతను కాపాడాలి" అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వార్డు మహిళలు, స్థానిక నాయకులు, వివిధ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

15-08-2026