పురుగుల మందు డబ్బాలతో వినూత్న నిరసన!
వడ్లకొండలో రైతన్నల ఆగ్రహం
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon district) వడ్లకొండ గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. జీవనాధారమైన యేన చెరువుకు గోదావరి జలాలు(Godavari waters) తరలించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. చెరువులో నీళ్లు లేక గత కొన్నేళ్లుగా పంటలలు ఎండిపోతున్నాయని, ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు(Farmers ) పురుగుల మందు డబ్బాలను చేతబట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు తమ గోడు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తక్షణమే గోదావరి జలాలను మేన చెరువుకు మళ్లించి చెరువును నింపాలని, లేనిపక్షంలో ఆమరణ దీక్షలకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ఈ ధర్నా కారణంగా జనగామ - వడ్లకొండ ప్రధాన రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.