చలో లోక్‌భవన్ ఉద్రిక్తం
- సీఈసీ రాజీనామాకు డిమాండ్
- ఇండీ కూటమి ఆందోళన
- నెక్లెస్‌రోడ్డు నుంచి ర్యాలీ
- మూడంచెల బారికేడ్లతో బందోబస్తు
- బారికేడ్లు దూకేందుకు నేతలు యత్నం
- అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం
- పీసీసీ చీఫ్,- మంత్రులు, కూటమి నేతల అరెస్ట్
- పంజాగుట్ట పీఎస్‌కు తరలింపు
- సీఈసీ రాజీనామా చేసేదాకా పోరాటం ఆగదని హెచ్చరిక
- దేశంలో ఓటు కాపాడుకునే దుస్ధితి సిగ్గుచేటని మండిపాటు
హైదరాబాద్/ ఖైరతాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండీ కూటమి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేపట్టిన ‘చలో లోక్‌భవన్(Chalo Lok Bhavan)’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భద్రతా వలయాన్ని ఛేదించుకునేందుకు నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితులు చేయిదాటే వరకు చేరడంతో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తోపాటు మంత్రులు, ఇతర నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ర్యాలీ..
నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు కూటమి నేతలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. లోక్‌భవన్ వద్దకు చేరుకునే సరికి భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేశారు. నేతలు ముందుకెళ్లకుండా నిలువరించారు. దీంతో పోలీసులకు, ఇండీ కూటమి నేతలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు లోక్‌భవన్ ఎదుట రోడ్డుపైనే నిరసనకు దిగారు.
మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జూపల్లి కృష్ణా రావు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, టీజేఎస్ అధ్యక్షులు కోదండరా మ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ఇతర వామపక్ష పార్టీల నేతలు, కాం గ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చే యాలని డిమాండ్ చేశారు. అంతకుముందే లోక్‌భవన్ వద్ద మూడెంచల భద్రతను ఏ ర్పాటు చేశారు. పరిస్థితుల చేయిదాటే వరకు రావడంతో పోలీసులు జోక్యం చేసుకుని మహేష్‌కుమార్‌గౌడ్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పంజాగుట్టతో పాటు ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఓటును కాపాడుకోవాలి: పీసీసీ చీఫ్
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు పలువురు మంత్రు లు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఓటు హక్కును కాపాడుకోవడానికి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చి ందని ఆవేదన వ్యక్తం చేశారు. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ, ప్రి యాంక గాంధీ సహా ఇండియా కూటమి నేతలను పోలీసులు అదుపులో తీసుకున్న ఘటనను ఖండించారు.
రాహుల్ గాంధీ చే స్తున్న నిరసనకు దేశ ప్రజలందరూ మద్దతు తెలుపుతున్నారని, వెంటనే బీజేపీ స్పందించి ఓటు హక్కును కోల్పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో రాజీనామా చేయించాలని డిమాండ్ చేస్తున్నాం-. రాజ్యాంగ బద్ధమైన సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. ప్రశ్నించే గొంతులను పోలీసులతో నొక్కేయాలని చూస్తోంది’ అని మండిపడ్డారు. సీ ఈసీపై ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తు న్నా పదవిలో కొనసాగడం సరికాదని, తక్షణమే స్పందించి రాజీనామా చేయాలని పీసీ సీ చీఫ్ డిమాండ్ చేశారు.
ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసే పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల లేదని ఆయన ఆరోపించారు. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని , ఎన్నికల ప్రక్రియపై ప్ర జలకు పూర్తి విశ్వాసం కలిగేలా పారదర్శకత పాటించాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ ఆందోళనలు కొనసాగుతా యన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 13 కోట్లకు పైగా పేర్లు డ్రాప్ట్‌రోల్స్ నుంచి తొలగించడం సరికాదని మంత్రి పొంగులేటి అన్నారు.
సర్ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించడం లేదని, అధికార పార్టీకి కొమ్ముకాసేలా నిర్ణయాలు తీసుకుంటోంద ని ఆయన విమర్శించారు. ఓట్ చోర్ ’ ఆరోపణలపై ప్రధాని మోదీ ప్రజలకు సమాధా నం చెప్పాలని మంత్రి వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీ వర్గాల వర్గాలకు చెందిన అర్హులైన ఓట్లను తొలగిస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.
సర్‌పై అనేక సందేహాలు: పొన్నం
సర్ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు, సందేహాలు ఉన్నాయని మంత్రి పొ న్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సర్ ప్రక్రియపై కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో సర్ కు సంబంధించి క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణ గడువు అక్టోబర్ 7తో ముగిసింది. అక్టోబర్ 7 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 27,193 ఫారం- దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటిలో 25,335 దరఖాస్తులు కనీసం ఏడు రోజులుగా పెండి ంగ్‌లో ఉండగా, 24,506 దరఖాస్తులు 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.