పోగొట్టుకున్న 67 ఫోన్లు బాధితులకు అందజేత
08-10-2026 | 10:51pm
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా పోలీసులు సీఈఐఆర్ పోర్టల్(CEIR portal) ద్వారా రికవరీ చేసిన 67 మొబైల్ ఫోన్ల(Mobile Phones)ను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్(DCP Rajamahendra Naik) మాట్లాడుతూ, ఫోన్ పోయిన వెంటనే భయపడకుండా కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్ పోర్టల్ - https://www.ceir.gov.in/లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ఫోన్ బ్లాక్ అవుతుందని, తిరిగి దొరికే అవకాశం ఎక్కువని తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని వారు పోలీస్ స్టేషన్ లోని సీఈఐఆర్ బాధ్యతాధికారిని సంప్రదించాలని, సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనవద్దని హెచ్చరించారు. రికవరీలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.