గర్భిణులకు ఘనంగా శ్రీమంతం

09-10-2026 | 12:17am

పాయకారి యానంబైల్ అంగన్వాడీ కేంద్రంలో సాంప్రదాయబద్ధంగా వేడుకలు

పాల్వంచ,(విజయక్రాంతి): పాయకారి యానంబైల్ గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రం(Anganwadi center)లో గర్భిణులకు శ్రీమంతం కార్యక్రమాన్ని(Sreemantham ceremony) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులను పూలు, పసుపు, కుంకుమతో సంప్రదాయబద్ధంగా అలంకరించి, పండ్లు, తాంబూలం  అందజేసి ఆశీర్వదించారు.

గర్భిణులు, పుట్టబోయే శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతున్న పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో సీడీపీఓ లక్ష్మీప్రసన్న, సూపర్‌వైజర్ మాధవీలత, గ్రామ సర్పంచ్ పూనెం సూరమ్మ, కార్యదర్శి మౌనిక, బాబూరావు, అంగన్వాడీ సిబ్బంది కోరం వీరభద్రమ్మ, వజ్జ చుక్కమ్మ, కృష్ణవేణి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు