మహిళలకు చీరల పంపిణీ

09-10-2026 | 12:23am

రాజాపూర్: రాజాపూర్ మండలం(Rajapur mandal)లోని చోక్కంపేట్ గ్రామంలో ఈనెల 14 నుండి 16వ తేదీ వరకు కొనసాగుతున్న శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామి ఆలయ పునర్నిర్మాణం మరియు గరుడధ్వజస్తంభ& విగ్రహ ప్రతిష్ఠపన, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్బంగా గురువారం మాజీ ఎంపీటీసీ చించోడు అభిమన్య రెడ్డి రాఘవాపూర్ గ్రామ మహిళలకు అందించారు.

గ్రామ సర్పంచ్ అనూష మల్లేష్ మహిళలందరికీ  చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూళ్ల అనూష మల్లేష్, డిప్యూటీ సర్పంచ్ యాదయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, Anal డిప్యూటీ ప్రియాంక చిరంజీవి, కృష్ణ  జనార్దన్ గౌడ్, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు