బయ్యారం సీఐ వెంకటేశ్వరరావుకు అరుదైన 'కఠిన సేవా పథకం.
పినపాక,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సీఐ)గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వరరావు(Bayyaram CI Venkateswara Rao) అరుదైన 'కఠిన సేవా పథకం'(Katina Seva Puraskaram)ను అందుకున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్(SP Rohit Raj) చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
అంకితభావానికి దక్కిన గుర్తింపు
సీఐ వెంకటేశ్వరరావు తన విధి నిర్వహణలో నిత్యం అంకితభావం, నిబద్ధత ప్రదర్శిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ముందుంటున్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలను అందించడంలోనూ, నేరాల నియంత్రణలోనూ ఆయన చూపుతున్న చొరవనుతాము గుర్తించినట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రతిభను మెచ్చి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆయనకు ఈ ప్రత్యేక పురస్కారాన్ని అందజేసి అభినందించారు.
శుభాకాంక్షలు వెల్లువ
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి గుర్తింపు పొందడం పట్ల మండల ప్రజలు, తోటి పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సీఐ వెంకటేశ్వరరావుకు ఈ పురస్కారం రావడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పోలీస్ అధికారులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని సేవలను అందించి మరిన్ని పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.