జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

02-10-2026 | 01:57pm

గాంధీ విగ్రహానికి వినతి పత్రాలు

జనగామ అక్టోబర్ 2 (విజయక్రాంతి): గాంధీ జయంతి సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలను పోస్ట్ కార్డుల ద్వారా గాంధీ విగ్రహానికి అందజేశారు.

TUWJ H-143 జిల్లా అధ్యక్షుడు జాల రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

మరిన్ని వార్తలు