జర్నలిస్టుల సంక్షేమం పాలకుల బాధ్యత

02-10-2026 | 02:52pm

ఇల్లెందు టౌన్, అక్టోబర్ 2, (విజయక్రాంతి): ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభంగా నిలుస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి(Government) మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల(Journalists)  హక్కులు, సంక్షేమాన్ని పాలకులు విస్మరించడం సరికాదని సీనియర్ జర్నలిస్టు గడ్డం వెంకటేశ్వర్లు, TUWJ (IJU) ఇల్లెందు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు నర్సి, శ్రావణ్ రెడ్డి అన్నారు. TUWJ (IJU) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఇల్లెందులో వర్కింగ్ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరసన చేపట్టారు.

జగదాంబ సెంటర్ నుంచి ఆమ్ బజార్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి రెవెన్యూ అధికారికి వినతిపత్రం అందజేశారు. అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని, కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉండేలా మెరుగైన హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, జర్నలిస్టుల ప్రయాణ సౌకర్యం కోసం రైల్వే పాసులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్ కమిటీ నాయకులు, సీనియర్ జర్నలిస్టులు, యూనియన్ సభ్యులు అన్నారపు వెంకటేశ్వర్లు, గుడివాడ శ్రీనివాస్, ఎల్. వీరమోహన్, సుమంత్, ఎం.డి. పాషా, నరేష్, పసుమర్తి లక్ష్మణరావు, వీరన్న, ప్రశాంత్, సందీప్, మహేందర్ రెడ్డి, దేవిరెడ్డి, చందు, రమణ, విజ్ఞాన్, కడారి నటరాజ్, చారి, రామకృష్ణ, సర్వేష్, దసృ, షేక్ సలీం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు