ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి

02-10-2026 | 03:04pm
  1. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలి
  2. ఓటర్ల జాబితాపై సమగ్ర విచారణ చేపట్టాలి
  3. ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామం లో సీపీఐ(ఎం) నిరసన...మద్దాల ప్రభాకర్ డిమాండ్

ఎర్రుపాలెం అక్టోబర్ 2 (విజయ క్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఎర్రుపాలెం మండలం కాచవరం గ్రామం లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను(Chief Election Commissioner Gyanesh Kumar) పదవి నుంచి తొలగించాలని, ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై సమగ్ర విచారణ చేపట్టాలని మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ డిమాండ్ చేశారు.

ఈ సందర్బంగా  పార్టీ మండల కార్యదర్శి  మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించి ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలని కోరారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర విచారణ చేపట్టాలని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన పేర్లను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో మండల కమిటీ సభ్యులు, నర్సింహపురం ఉప సర్పంచ్ గామసు జోగయ్య, వృత్తి సంఘం జిల్లా నాయకులు గౌరాజు రాములు,శాఖ కార్యదర్శి కుడేల్లి నాగేశ్వరావు,షేక్ మధర్ సాహెబ్, హస్సన్,కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు