గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేత

02-10-2026 | 03:00pm

జనగామ, అక్టోబర్ 2 (విజయక్రాంతి): జర్నలిస్టుల హక్కులు, భద్రత, సామాజిక, ఆర్థిక సంక్షేమం కోసం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(Indian Journalists Union)  పిలుపు మేరకు శుక్రవారం రోజున గాంధీ జయంతి సందర్భంగా టీయూడబ్ల్యూజే–ఐజేయూ జనగామ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగల బిక్షపతి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక జాతీయ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

జర్నలిస్టులు, జర్నలిస్టేతర మీడియా సిబ్బందికి ప్రస్తుత జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు కల్పించేందుకు కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేయాలని, ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించి నగదు రహిత వైద్య చికిత్స సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పార్నంది వెంకటస్వామి, కోశాధికారి ఓరుగంటి సంతోష్, టీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు కెమిడి ఉపేందర్, ప్రధాన కార్యదర్శి పసునూరి గణేష్, బొల్లు ఎల్లారెడ్డి, కొత్తపల్లి కిరణ్, వంగ శ్రీకాంత్ రెడ్డి, శేషత్వం ఆనంద్, సందేన రమేష్, జంపాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు