నాగిరెడ్డిపేట్ మండలంలో సహకార సంఘాల చైర్మన్ల నియామకం

05-10-2026 | 11:48pm

తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులుగా శ్రీధర్ గౌడ్

మాల్తుమ్మెద సహకార సంఘం అధ్యక్షులుగా సురేందర్ గౌడ్

నాగిరెడ్డిపేట్, (విజయక్రాంతి): మండలంలోని తాండూర్ కిచ్చన్నపేట ప్రాథమిక సహకార సంఘం(Kichannapeta Primary Cooperative Society) అధ్యక్షులుగా శ్రీధర్ గౌడ్ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. మాల్తుమ్మెద ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులుగా సురేందర్ గౌడ్ను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితో పాటు సహకార సంఘాల డైరెక్టర్లను నియమించారు. తమ నియామకానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు, డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు