ఇందిరమ్మ మహిళల లబ్ధిదారులకు మంజూరు పాత్రలో పంపిణీ
నాగిరెడ్డిపేట (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్(Gopalpet) గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంజూరైన తిమ్మాయపల్లి పోచమ్మ, ఎల్పకొండ నవనీత అనే ఇద్దరు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతం చేసి నాణ్యతతో చేపట్టి బిల్లులు సకాలంలో పొందాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకున్న తిమ్మాయిపల్లి మంజులకు గోడ గడియారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సలీం, ఉప సర్పంచ్ గులాం హుస్సేన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇమామ్, యాదగిరి, రాజు పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.