ఎమ్మెల్యే పల్లా పరామర్శ
17-09-2026 | 08:04pm
తరిగొప్పుల, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన ప్రజాపక్షం రిపోర్టర్ పింగిలి వేణుగోపాల్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా, గురువారం స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి చిలువేరు లింగం, మాజీ జెడ్పీటీసీ ముద్దసాని పద్మజ వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు ఏడెల్లి శ్రీనివాస్ రెడ్డి, భూక్య జూమ్ లాల్ నాయక్, తాళ్లపెల్లి రాజేశ్వర్ గౌడ్, బత్తిని సురేందర్, భూక్య రవి, అంకం రాజారాం, అంకం శ్రీనివాస్, చెన్నూరి సంజీవ్, మల్యాల సుధీర్, ఖాతా టోనీ, చింతల జైపాల్ తదితరులు ఉన్నారు.