కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
17-09-2026 | 09:20pm
భూత్పూర్, సెప్టెంబర్ 17: భూత్పూర్ మండల పరిధిలోని వెల్కిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ జగ్గి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సమరసింహారెడ్డి తో పాటు బీఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudan Reddy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జిఎంఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరామని తెలిపారు.