ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా పాలన
- అభివృద్ధి, సంక్షేమంతో నాగర్‌కర్నూల్‌ను ముందుకు తీసుకెళ్లాలి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ప్రజా పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య(Finance Commission Chairman Siricilla Rajaiah) అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రజా పాలన దినోత్సవం(Telangana prajapalana dinotsavam) సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన వేడుకల్లో రాజయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ తల్లి, మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు నివాళులర్పించి, అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల(Welfare schemes) ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్న ఎంపీ మల్లు రవి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు రాజేష్‌రెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను అభినందించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.