ఘనంగా ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు
09-09-2026 | 06:50pm
జనగామ,(విజయక్రాంతి): హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్ నగర్ లో రాజ్యసభ ఎంపీ మందాడి అనిల్ కుమార్ యాదవ్(MP Mandadi Anil Kumar) పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ(Jangaon Agricultural Market Committee) చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాధం చిన్న, మినలపురం శ్రీకాంత్, బనుక ప్రభాకర్, రాజు మరియు వివిధ జిల్లాల యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.