పర్యాటక దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
25-09-2026 | 02:22pm
భూపాలపల్లి (రేగొండ), సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి): పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం రేగొండ మండలం పాండవుల గుట్ట వద్ద నిర్వహించనున్న కార్యక్రమ ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి(Additional Collector Vijayalakshmi) శుక్రవారం పరిశీలించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమ ప్రాంగణం, మౌలిక వసతులు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి, శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి చిర్ర రఘు గౌడ్, అటవీశాఖ సిబ్బంది