ఎల్‌నినోపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
భూపాలపల్లి,అక్టోబర్ 23 (విజయ క్రాంతి): ఎల్‌నినో(El Niño) ప్రభావాలతో తలెత్తే వాతావరణ మార్పులు, వర్షపాత లోటు, ఉష్ణోగ్రతల పెరుగుదలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు(State Government Chief Secretary Sanjay Jaju) సూచించారు. శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో సమాచార పౌర సంబంధాలు, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు.
సదస్సులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీపీఆర్వో శీలం శ్రీనివాస్ తో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు. కళాజాతాలు, పాటలు, నాటికల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావాలు, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు, ప్రత్యామ్నాయ పంటలు, తాగునీటి వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ డా. జి. వెన్నెల, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.