బాలల రక్షణతోనే బంగారు భవిష్యత్తు
సీనియర్ సివిల్ జడ్జి, తాడూరు మహతి వైష్ణవి
గణపురం, అక్టోబర్ 26 (విజయక్రాంతి): బాలల రక్షణతోనే బంగారు భవిష్యత్తని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి అన్నారు. జాతీయ, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాలతో సురక్షిత్ బచ్పన్ అభియాన్ లో భాగంగా గణపురం మండల ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం బాలల పరిరక్షణ(Child Protection)పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కేజీబీవీ పాఠశాలలో సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తాడూరు మహతి వైష్ణవి మాట్లాడుతూ పోక్సో నేరాలు, సైబర్ మోసాల నుంచి పిల్లలను కాపాడటం అందరి బాధ్యత అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల మాట్లాడుతూ ప్రతి బిడ్డ బాల్యం మనందరి బాధ్యత అన్నారు. ఈకార్యక్రమంలో డీసీపీఓ వెంకటస్వామి, జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి, సూపరింటెండెంట్ రఘురాం, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది అంబాల దేవేందర్, గోపాల్, రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.