ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
26-10-2026 | 08:11pm
రాజాపూర్ అక్టోబర్ 26: వాల్మీకి మహర్షి జీవితం మానవాళికి ఎంతో ఆదర్శమని సర్పంచులు రామకృష్ణ వెంకటయ్య గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని కుచ్చరకల్ గ్రామంలో వాల్మీకి జయంతి(Valmiki Jayanti) ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుడు ఎలా జీవించాలో కుటుంబ విలువలకు పెద్దపీట వేసిన రామాయణం మహా గ్రంధాన్ని రచించి మానవ జాతికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రేష్మ నజీమ్, యాదగిరి,దస్తగిరి శ్రీశైలం ఆనంద్ గౌడ్ మాధవరెడ్డి నాగేష్ తదితరులు పాల్గొన్నారు.