తాగునీటి కష్టాలకు చెక్.. మళ్లీ సరఫరా
గణపురం, అక్టోబర్ 10 (విజయక్రాంతి): గ్రామీణ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, తిమ్మాపురం గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని బుద్ధారం సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ అన్నారు. గ్రామంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఆమె ప్రత్యేక చొరవ తీసుకొని నూతన బోరు మోటారును బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు (Restoration).
తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడకుండా సమస్యను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు. నూతన మోటారు బిగింపుతో గ్రామంలో తిరిగి తాగునీటి సరఫరా అందుబాటులోకి రావడంతో గ్రామస్థులకు ఊరట లభించింది. ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు సాగడం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మారేపల్లి ఐలయ్యతో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.