టీఎస్ యూటీఫ్ దామరచర్ల కమిటీ ఎన్నిక

10-10-2026 | 06:03pm

దామరచర్ల :అక్టోబర్ :10 : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(Telangana State United Teachers' Federation)  దామరచర్ల మండల(Damaracharla Mandal) మహాసభ శనివారం మిర్యాలగూడలోని టీచర్స్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా 2026–27 సంవత్సరానికి గాను దామరచర్ల మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా బి. శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా సి.హెచ్. శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షురాలిగా పి. సైదమ్మ, ఉపాధ్యక్షుడిగా సి.హెచ్. సైదులు, కోశాధికారిగా కె. వెంకటేశ్వర్లు, ఎఫ్ డబ్ల్యు ఎఫ్   కన్వీనర్ గా ఎస్.కె. సయ్యద్ పాషా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం జి ఓ 25ను సవరించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు ఉపాధ్యాయులపై పని భారం తగ్గించాలంటే తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడం అత్యవసరమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు