ఆందోళన కొనసాగిస్తారా? అంత్యక్రియలకు వెళ్తారా?

10-10-2026 | 04:38pm

న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే(Abhijeet Dipke) కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన నాయనమ్మ సావిత్రీబాయి శంకర్ దీప్కే (85) మహారాష్ట్రలోని హింగోళి జిల్లాలో శనివారం కన్నుమూశారు. అయితే, మరోవైపు ఢిల్లీలో పోలీసుల అదుపులో ఉన్న దీప్కేకు ఈ వార్తను పోలీసులు తెలియజేశారు. 

అంత్యక్రియలకు వెళ్లాలా? ఢిల్లీలోనే ఉండాలా?

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్(CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు అభిజీత్ దీప్కే శనివారం ముంబై నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, నిరసనకు అనుమతి లేకపోవడంతో విమానం దిగిన అనంతరం ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఆయన నాయనమ్మ మరణవార్త(Grandmother Death News) వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో దీప్కేకు ఎంపిక ఉందని, ఢిల్లీలోనే ఉండి నిరసన కొనసాగించాలా లేదా అంత్యక్రియల కోసం స్వగ్రామానికి వెళ్లాలా అనేది ఆయన ఇష్టమని పోలీసు వర్గాలు తెలిపినట్లు సమాచారం.

అనారోగ్యంతో నాయనమ్మ మృతి

మహారాష్ట్రలోని హింగోళి జిల్లా సంతుక్ పింప్రి గ్రామంలో సావిత్రీబాయి మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వయోభార సంబంధిత సమస్యలతోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

ఇదిలా ఉండగా, ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన అంశాలపై నిరసనకు దిగేందుకు సిద్ధమైన CJP నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అభిజీత్ దీప్కే తన నాయనమ్మ అంత్యక్రియలకు హాజరవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు