అవార్డులు పొందిన ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

21-09-2026 | 08:11pm

గణపురం, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో ఉత్తమ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేసు సతీష్‌ కుమార్ ఫిజికల్ డైరెక్టర్ సరితకు, ఆదర్శ మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ తిరుపతి ఉత్తమ ప్రిన్సిపాల్, కేజీబీవీ సోషల్ టీచర్ డి. విజయలక్ష్మికి ఉత్తమ అవార్డు(Best Award) రావడంతో పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.

మరిన్ని వార్తలు